Latest News

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సమీక్షించి, కొత్త రేట్లను విడుదల చేస్తాయి. ఈ క్రమంలో వాహనదారులు తమ ప్రాంతాల్లో ఇంధన ధరల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. జూన్ 24, 2026న తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇంధన ధరల వివరాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేటి ధరల ప్రకారం, లీటర్ పెట్రోల్ రూ.115.69గా ఉండగా, డీజిల్ ధర రూ.103.82గా నమోదైంది. గత కొన్ని రోజులుగా ధరల్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, జిల్లాల వారీగా ఉన్న స్థానిక పన్నులు, రవాణా ఛార్జీల కారణంగా స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. వరంగల్ వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలు దాదాపుగా ఇదే స్థాయిలో ఉన్నాయి. తమ ప్రాంతంలోని ఖచ్చితమైన రేట్ల కోసం స్థానిక పెట్రోల్ బంకుల్లో ధరలను సరిచూసుకోవడం మంచిది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.68గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.105.36 వద్ద విక్రయమవుతోంది. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నప్పటికీ, ప్రాంతీయ పన్నుల వల్ల స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే? Read More »

జూన్ 26న మొహర్రం సెలవు.. కేంద్రం క్లారిటీ!

మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న మొహర్రం సెలవు జూన్ 26 అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిటెడ్ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆషూరా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు పనిచేయవు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు కూడా ఆ రోజు సెలవు ఉంటుంది. సెలవు దినంపై స్పష్టత చంద్ర దర్శనం ఆధారంగా గల్ఫ్ దేశాలు, భారత్ మధ్య తేదీల్లో చిన్నపాటి మార్పులు ఉన్నాయి. అయినా సరే, దేశంలో జూన్ 26న మొహర్రం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గందరగోళానికి తెరపడింది. అన్ని ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ రంగం ఈ సెలవును పాటిస్తాయి. ప్రజలు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. శుక్రవారం రావాల్సిన సెలవుతో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. శని, ఆదివారాలు కలిసి రావడం వల్ల మూడు రోజుల లాంగ్ వీకెండ్ వచ్చేసింది. వరుస సెలవులు కావడంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి, కుటుంబాలతో సమయం గడిపే వారికి ఇది మంచి అవకాశం. ఆఫీసు పనుల నుంచి విరామం పొందేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది.

జూన్ 26న మొహర్రం సెలవు.. కేంద్రం క్లారిటీ! Read More »

హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ 5 మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. సాఫీగా జర్నీ..

హైదరాబాద్‌ వాసులకు టీజీఎస్‌ఆర్టీసీ తీపికబురు అందించింది. మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 37 ఎలక్ట్రిక్ బస్సులను నూతనంగా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ వాహనాలు నగారానికి చేరుకోగా.. ప్రయాణికుల కోసం సర్వీసులు నడిపేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆలస్యం కావడానికి ప్రధాన కారణం డ్రైవర్ల కొరతేనని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అర్హత కలిగిన డ్రైవర్లు అందుబాటులో లేరు. డ్రైవర్లకు మెడికల్ టెస్టులు,డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటిల్లో చాలామంది అర్హత సాధించలేకపోవడం వల్ల డ్రైవర్ల నియామకంలో ఆలస్యం చోటుచేసుకుంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ మార్గాల్లో తిరగనున్న కొత్త బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్ల నియామకానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కానీ టెస్టుల్లో అర్హత సాధించినవారికి ప్రత్యేకంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతనే వారికి ఎలక్ట్రిక్ బస్సులను నడిపే బాధ్యతలను అప్పగిస్తున్నారు. త్వరలోనే డ్రైవర్ల నియామకం పూర్తయిన తర్వాత కొత్త 37 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానున్నారు. ఈ బస్సులు 5 మార్గాల్లో తిరగనున్నాయని తెలుస్తోంది. సనత్‌నగర్‌ నుంచి శంకర్‌పల్లి బస్ స్టేషన్‌, మెహిదీపట్నం టు ప్రగతినగర్‌. జగద్గిరిగుట్ట టు సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ టు మియాపూర్‌ క్రాస్‌రోడ్‌, పటాన్‌చెరు బస్టాండ్‌ టు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మధ్య వీటిని తిప్పనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో అనే మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి ఉయోగపడుతున్నాయి. కాలుష్య నివారణకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. రానున్న రోజుల్లో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుంది. ఇటీవల కూకట్ పల్లి డిపో పరిధిలో 23 ఎలక్ట్రిక్ బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సు 5 వేర్వేరు మార్గాల్లో సర్వీసులు అందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి అద్బుత స్పందన వస్తోంది. దీంతో మరిన్ని బస్సులను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ 5 మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. సాఫీగా జర్నీ.. Read More »

ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..!

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో జూన్ 20 (శనివారం) ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రేపు (శనివారం) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరోవైపు కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం (20-06-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అత్యధికంగా అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో 61మిమీ వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 36మిమీ, వైఎస్సార్ కడప జిల్లా చౌడూరులో 31మిమీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 29.9మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 28.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి 26.5మిమీ, కోటబొమ్మాళిలో 26.2మిమీ, లావేరులో 22.5మిమీ, కర్నూలు జిల్లా తోవిలో 22మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..! Read More »

మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూ్స్. గత రెండు రోజులుగా మళ్లీ గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలు కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో ధరలు తగ్గి భారీ ఉపశమనం కల్గిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడే కొని పెట్టుకుందామనే ఆలోచనకు వస్తున్నారు. బుధవారం ధరలు డౌన్ అవ్వగా.. అనంతరం ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా.. ఇవాళ రూ.270 మేర డౌన్ అయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు ఇప్పుడు రూ.1,32,300 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజు రూ.250 క్రాష్ అయ్యయి. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,330గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,920 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,590గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,330 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300గా ఉన్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,44,480గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,49,900గా ఉంది. చెన్నైలో రూ.2,49,900గా ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న క్రమంలో గోల్డ్ రేట్లపై వాటి ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. యుద్దం ముగిసిపోవడంతో యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వాటిల్లోకి పెట్టుబడులు వెళ్లడంతో గోల్డ్‌క డిమాండ్ తగ్గింది.

మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..? Read More »

President Murmu confers Padma awards to Rohit Sharma, Mammootty, Vijay Amritraj

Tennis legend Vijay Amritraj, actors Mammootty and Satish Shah, cricketer Rohit Sharma, and playback singer Alka Yagnik were among eminent personalities conferred with the Padma awards by President Droupadi Murmu on Tuesday. In the second civil investiture ceremony at the Ganatantra Mandap of Rashtrapati Bhavan, the President presented the Padma Vibhushan to former Supreme Court judge K T Thomas for public affairs and eminent Malayalam journalist P Narayanan for contribution to literature and education. Alka Yagnik, Mammootty, American oncologist Dattatreyudu Nori, tennis player Vijay Amritraj, industrialist S K M Maeilanandhan, and social worker and educationist Vellappally Natesan received the Padma Bhushan during the ceremony. Rupi Soren, wife of JMM founder Shibu Soren, received the Padma Bhushan on behalf of the late leader. The President conferred the Padma Shri on cricketer Rohit Sharma, who led India to victory in the last T20 World Cup, and hockey player Savita Punia. Vladimir Mestvirishvili, the Georgian coach who mentored Indian Olympic medallists like Sushil Kumar, Yogeshwar Dutt and Ravi Dahiya, was awarded the Padma Shri posthumously. His wife received the award on his behalf. The function was attended by Vice President C P Radhakrishnan, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla and Union Home Minister Amit Shah, among other dignitaries. The arrival of 83-year-old folk artist and cultural guardian from Nagaland, Guru Sangyusang Pongener, added a vibrant cultural touch to the ceremony. Dressed in traditional Naga attire, his spirited entry drew applause from the audience, including Prime Minister Modi. He received the Padma Shri. Social worker Budhri Tati, who worked in education and women’s empowerment in the erstwhile Naxal-affected Bastar region of Chhattisgarh, also received the Padma Shri. She preferred traditional attire and received warm applause while accepting the honour. The President also conferred the Padma Shri on actor Satish Shah posthumously. The actor was known for roles in Ye Jo Hai Zindagi, Sarabhai vs Sarabhai and the cult film Jaane Bhi Do Yaaro. His brother received the award on his behalf. Former CEO of Prasar Bharati Shashi Shekhar Vempati, now CBFC chairman, was also awarded the Padma Shri. The President conferred a total of 65 Padma awards in the ceremony, including two Padma Vibhushan, seven Padma Bhushan and 56 Padma Shri awards. Actor R Madhavan, DRDL scientist Chandramouli Gaddamanugu, RVS Mani and entrepreneur Ashok Khade were among other Padma Shri awardees. Dalit author Asok Kumar Haldar, railway guard-turned-writer; Carnatic duo Ranjani and Gayatri; actor Anil Kumar Rastogi and chemistry professor Mahendra Nath Roy were also conferred the Padma Shri. In a post on X, Prime Minister Modi said the Padma awards celebrate exceptional service and dedication across diverse fields. Union Home Minister Amit Shah also congratulated the awardees and hosted a dinner in their honour.

President Murmu confers Padma awards to Rohit Sharma, Mammootty, Vijay Amritraj Read More »

ఘోరం.. ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు!

పల్నాడు జిల్లాలో సోమవారం (జూన్ 22) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పలువురు ఆటోలో యడ్లపాడు మండలం సంకరాత్రిపాడు గ్రామానికి బయలుదేరారు. అక్కడ జరుగుతున్న దశదిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కామేపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలంలోనే వేల్పూరుకు చెందిన సుబ్బాయమ్మ, ఏడుకొండలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమనమ్మను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే నరసరావుపేటలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటన వేల్పూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

ఘోరం.. ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు! Read More »